సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (15:24 IST)

ఇంట్లో వ్యభిచారం.. డిగ్రీ విద్యార్థినుల అరెస్టు

తెలంగాణ రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, సులభంగా డబ్బు సంపాదన కోసం పలువురు అమ్మాయిలు పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారు పోలీసులకు చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 
 
తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవరకొండ రోడ్డులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఒకటో పట్టణ పోలీసులు ఆ ఇంటిలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
 
అపుడు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న రమేష్‌ చారి, అతడి భార్యతో పాటు ఇద్దరు విటులు, మరో యువతిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను జిల్లాలోని సఖి కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.