ఈజీ మనీ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం... ఎక్కడ?
కరోనా లాక్డౌన్‌తో ఎక్కడి షూటింగులు అక్కడే బంద్ అయిపోయాయి. దీంతో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు పూటగడవడం కోసం ఇతర ఆదాయా మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమ్మాయిలు వ్యభిచారంలోకి దిగుతున్నారు. తాజాగా కొందరు జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈజీ మనీ సంపాదనలో భాగంగా, వీరంతా ఈ పాడుపనికి పాల్పడ్డారు. దీంతో లాడ్జీ నిర్వాహకుడితో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో వెలుగుచూసిన ఈ ఘటనను పరిశీలిస్తే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి, శాపూర్ నగర్‌లోని రాఘవేంద్ర లాడ్జిలో కొంతకాలంగా గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం జరుగుతోందనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో నిఘా వేసిన జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జిపై దాడులు నిర్వహించారు.
నాలుగు గదులలోని నలుగురు విటులు దనం సంపత్, ఒగ్గు ఓబిలాష్, మేరుగు సురేష్, నర్రా రాజ్ కుమార్‌లతో పాటు నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్‌ను.. మరో నలుగురు మహిళలైన యెడిగంటి అమన్, మహాతో రాధా, షేక్ సానియా, షేక్ షభానాలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళల్లో షేక్ హసీనా, షేక్ షభానాలు సినీ జూనియర్ ఆర్టిస్టులు కాగా, కస్టమర్ నర్రా రాజ్ కుమార్ వీఆర్‌ఓగా పని చేస్తున్నాడు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కరోనా ఉన్నందున లాడ్జి నడవక పోవడంతో డబ్బుల కోసం లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నానని నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.