గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (08:51 IST)

రాజస్థాన్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం - తెలంగాణ డీఐజీ డీజీ భార్య మృతి

road accident
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర సీఐడీ డీజీ గోవింద్ సింగ్ సతీమణి దుర్మరణం పాలయ్యారు. మాతేశ్వరి తనోతరాయ్ మాత ఆలయ సందర్శనం కోసం గోవింద్ సింగ్ దంపతులు వెల్లారు. వీరిద్దరూ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రామ్‌గఢ్ వద్ద అదుపుతప్పి బోల్తాపడంది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ ప్రాణాలు కోల్పోయారు. గోవింద్ సింగ్‌తో పాటు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. 
 
అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గోవింద్ సింగ్ స‌తీస‌మేతంగా తెలంగాణ‌కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో రామ్‌‍గ‌ఢ్ స‌మీపంలో ఘంటియాలి మాత ఆల‌యం స‌మీపంలోకి రాగానే గోవింద్ సింగ్ కారు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో షీలా సింగ్ అక్క‌డిక్క‌డే మృతి చెందారు.
 
ఈ ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న బీఎస్ఎఫ్ జ‌వాన్లు అక్క‌డికి చేరుకుని గాయ‌ప‌డ్డ గోవింద్ సింగ్‌, ఆయ‌న కారు డ్రైవ‌ర్‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గోవింద్ సింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.