బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (15:24 IST)

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. వెయ్యి రూపాయల కోసం హత్య.. శవాన్ని డ్రమ్‌లో దాచి..?

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయల కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం మండలం కాసులబాద్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ ఉండేవాళ్లు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో ఇద్దరు కలిసి మద్యం తాగి ఆంజనేయులు ఇంట్లో పడుతుకున్నారు. అయితే, మరుసటిరోజు ఆంజనేయులు నిద్రలేసేలోపే.. రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆంజనేయులు ఇంట్లో దాచుకున్న వెయ్యి రూపాయలు మాయం అయ్యాయి.
 
ఇక, ఈ విషయంపై ఆంజనేయులు.. రాజును అడిగితే తాను తీయలేదని చెప్పినా.. మూడు రోజులు కనిపించకుండా పోయాడు. తిరిగి ఆగస్టు 15న ఇద్దరు కలుసుకున్నారు. మళ్లీ డబ్బుల గురించి ఆరా తీసినా పాత సమాధానమైన ఎదురైంది. ఇక, ఆ రాత్రి ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నారు రాజు నిద్రిస్తున్న సమయం చూసి తలపై కొట్టడంతో.. రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 
ఇక, ఏం చేయాలో తెలియక ఓ రోజు శవాన్ని డ్రమ్‌లో దాచాడు. మరుసటి రోజు మృతదేహాన్ని మూడు ముక్కలు చేశాడు. తలను ఓ దగ్గర, మొండెం మరో దగ్గర.. కాళ్ల భాగాన్ని ఇంకో దగ్గర పడేశాడు. ఇదే సమయంలో.. తన పర్సును కూడా పారేసుకున్నాడు.. పర్సు ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఆంజనేయులను అరెస్ట్ చేశారు.