గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:59 IST)

ఇంటిలో కృష్ణంరాజు పార్థివదేవం - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

kcrao
రెబెల్ స్టార్ కృష్ణంరాజు పార్థివదేహం ఆయన ఇంటికి చేరుకుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి ఏఐజీ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. ఆయన పార్థివదేవాన్ని సోమవారం వరకు అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.