గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (12:48 IST)

బాలాపూర్ గణేష్ లడ్డూకి పోటాపోటీ, ఎంతకి దక్కించుకున్నారో తెలిస్తే షాక్

Balapur Laddu
గణేషుడి ఉత్సవాలు ముగింపుకి రాగానే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈసారి కూడా రికార్డ్ ధర పలికింది బాలాపూర్ లడ్డు.

 
పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంపాటలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను రూ. 24.60 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డు కోసం మొత్తం ఆరుగురు పోటీపడ్డారు. ఎట్టకేలకు భారీ ధరతో లడ్డూను లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలం పాట నిర్వహిస్తున్నప్పుడు అక్కడ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వున్నారు. 

 
1994లో బాలాపూర్ గణేషుడి లడ్డును రూ. 450కి దక్కించుకున్నారు. ఆ తర్వాత క్రమంగా బాలాపూర్ లడ్డు కోసం పోటీ తీవ్రమవుతూ వచ్చింది. ఈ క్రమంలో గత ఏడాది ఈ లడ్డూను 18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈసారి రికార్డు మొత్తం రూ. 24.60 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్నారు.