సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (22:21 IST)

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

fire accident
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఈ పారిశ్రామికవాడ ఉంది. ఇక్కడ శనివారం మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండ మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ముందుగా పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. వాటిని అపుదులో చేయలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమకు వ్యాపించాయి. 
 
దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలన్నీ మంటల్లో కాలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్‌చెరు, బీడీఎల్‌, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.