బ్రష్టు పట్టించారు కదరా.. మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్ రావు ఆవేదన

sankarrao
ఎం| Last Updated: శనివారం, 25 జనవరి 2020 (22:28 IST)
కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తామంటే పట్టించుకోలేదు.. కానీ ఈ రోజు పార్టీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు కదరా భ్రష్టులారా.. ఇదెక్కడి న్యాయం షాద్ నగర్ పేరు వింటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రావాలి.

కానీ నేడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని భ్రష్టు పట్టించి నేడు వేడుక చూస్తున్న నేతలరా పార్టీ పతనావస్థకు చేరుకుంటే నేను చూడలేను ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షాద్ నగర్ మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డాక్టర్ పి. శంకర్ రావు చలించిపోయారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో రెండు సీట్లు రావడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకున్నదని ఈ సందర్భంలో ఆయన ప్రశ్నించారు. పైసల కోసం పార్టీని వాడుకొని పైసలు సంపాదించుకొని తరువాత పార్టీనీ నిర్దాక్షిణ్యంగా వదిలి పోయిన నాయకులు దీనికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అభివృద్ధి చేస్తానంటే కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను దూరం పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదనీ, షాద్ నగర్ నియోజకవర్గంను తన చేతిలో పెడితే నియోజకవర్గానికి బంగారు భవిష్యత్తును చూపిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలంటే తనలాంటి వారు చాలా అవసరమని ఆయన అన్నారు.
దీనిపై మరింత చదవండి :