గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (17:06 IST)

గర్భిణి ప్రసవ సమయంలో శిశువు తలపై కత్తెర గాయం, మృతి

ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. అమ్మ కడుపు నుండి ఆరాటపడుతూ బయట రాకుండానే తనువు చాలించింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బయట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రిలో జరిగింది.
 
సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు నర్సు ఆపరేషన్ చేసింది. ఆ సమయంలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సమయంలో కత్తెరతో శిశువు తలపై గాయం అయ్యింది. తీవ్రంగా బ్లీడింగ్ అయి చిన్నారి మృతి చెందింది.
 
దీంతో గర్భిణి బంధువులు సిబ్బంధి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.