సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 29 జులై 2019 (20:46 IST)

జైపాల్ రెడ్డి పాడె మోసిన కర్నాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్..

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీవీ ఘాట్‌ సమీపంలో నిర్వహించిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నకర్నాటక మాజీ స్పీకర్ రమేష్, జైపాల్‌ పాడెను భుజానకెత్తుకుని మోశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రమేశ్, జైపాల్ మరణంతో ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టనిపిస్తోందన్నారు. 
 
జైపాల్‌తో తనది 35 ఏళ్లకు పైబడిన అన్నదమ్ముల బంధమన్నారు. కర్ణాటక అసెంబ్లీలో తాను వ్యవహరించిన తీరుపై జైపాల్‌ రెడ్డికి వివరించాలని ఇక్కడికి వద్దామనుకున్నానన్నారు. కానీ భగవంతుడు తనకు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కష్టకాలంలో సైతం తప్పులు చేయకూడదని.. సైద్ధాంతిక నిబద్ధతతో ఉండాలని చెప్పిన మహానుభావుడన్నారు. తాను తప్పు చేస్తే జైపాల్ రెడ్డి మందలించేవారని, నాకు ఎన్నో సలహాలు సూచనలు అందించేవారని గుర్తుచేసుకున్నారు రమేశ్.