శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (15:13 IST)

ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా???

హైదరాబాద్ టెన్నిస్ స్టార్, భారత టెన్నిస్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెప్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోమాతపై కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.
 
కాగా, వికారాబాద్ అడవుల్లో ఇటీవల జరిగన కాల్పుల ఘ‌ట‌న‌లో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంచార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేత‌కు వచ్చిన ఆవును కాల్చి చంపిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 
ఈ విష‌య‌మై స్థానికుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. నిందితుడికి తుపాకీ ఎలా వ‌చ్చింద‌నే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రాజాసింగ్ సానియా మీర్జాపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.