మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:32 IST)

ప్రియురాలితో కలిసి సహజీవనం-కన్నకొడుకు ఇంటి నుంచి గెంటేశాడు

కన్నకొడుకు ఇంటి నుంచి గెంటేశాడని ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రియురాలితో కలిసి వుండేందుకు తనను ఇంటి నుంచి గెంటేశాడని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బర్కత్‌పురా దివాకర్ గార్డెన్స్‌లో నివసించే బి.హేమలత(65)కు శ్రీకాంత్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీకాంత్ 2017 నుంచి సింధూరారెడ్డి అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. అప్పటి నుంచి తల్లిని పట్టించుకోకుండా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించసాగాడు. 
 
ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దాంతో గత మార్చి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు శ్రీకాంత్‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని బాగా చూసుకుంటానని చెప్పి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని తన ఇంటికి తీసుకువచ్చాడు. 
 
అయితే ఆమె దగ్గర వున్న డబ్బును గుంజేసి తల్లిని బయటకు గెంటేశాడు. ఇప్పడు తనను చంపేందుకు కూడా వెనుకాడటంలేదని…ఇంట్లోంచి బయటకు తరిమేశారని ఆరోపిస్తూ తాజాగా హైమలత బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు శ్రీకాంత్, ఆమె ప్రియురాలు సింధూరా రెడ్డిలపై ఐపీసీ సెక్షన్‌ 509, ఎస్సీ, ఎస్టీ, సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.