బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (11:50 IST)

ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరో 10 రైళ్లు

ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు నగరాలను తమ ఊర్లకు వెళ్లే వారికోసం అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రటించింది. ఈ రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరుతాయి. అలాగే, మరికొన్ని రైళ్లు కాజీపేట, నల్గొండల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ఈ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో అనేక తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 10 రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఈ నెల 1, 14న కాచిగూడ - విశాఖపట్టణం, 8, 16న విశాఖపట్టణం - కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్ - కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ - లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
 
అయితే కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది.