గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (09:01 IST)

ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ : కేసీఆర్ నిర్ణయం

kcrcm
ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెషన్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.
 
ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.