సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (16:29 IST)

ఇంటర్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కళాశాలలు మూసేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.
 
ప్రత్యక్ష తరగతులు లేనప్పటికీ ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున విద్యా సంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా? లేదా అనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.