శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Modified: బుధవారం, 29 జూన్ 2016 (15:08 IST)

హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాదులా...? పెద్దతలకాయలే టార్గెట్... ఎన్‌ఐఏ అదుపులో ఆరుగురు

హైదరాబాద్‌: సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. దేశవ్యాప్తంగా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రదాడులకు వ్యూహం రచించాలన్నది ఈ గ్రూప్‌ లక్ష్యం. ఈ బృందం ఐసిస్ సానుభూతిపరులని అనుమానిస్తున

హైదరాబాద్‌: సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. దేశవ్యాప్తంగా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రదాడులకు వ్యూహం రచించాలన్నది ఈ గ్రూప్‌ లక్ష్యం. ఈ బృందం ఐసిస్ సానుభూతిపరులని అనుమానిస్తున్నారు. వీరి ప్రయత్నాల్ని పసిగట్టిన ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం స్థానిక పోలీసుల సహకారంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
 
ఈ సందర్భంగా పలువురు అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని... వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు కుట్ర పన్నినట్లు అధికారులకు సమాచారం అందింది. ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ బృందం అనుమానిత ఆరుగురిని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలిస్తున్నారు. 
 
ఈ ఏడాది జనవరిలో కూడా సోషల్‌నెట్ వర్కింగ్‌ సైట్లలో ఓ బృందంగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నిన వైనాన్ని ఎన్‌ఐఏ బృందం గుర్తించింది. అప్పుడు కూడా దాడులు నిర్వహించి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో కూడా హైదరాబాద్‌లోనే తొలుత అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం.