బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (08:57 IST)

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ సోదాలు

పన్ను ఎగవేశారన్న అభియోగాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆయన కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలకు దిగారు. అనేక బృందాలుగా విడిపోయిన అధికారులు.. మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గృహాలతో పాటు ఆయన వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా కొల్లంపల్లిలోని ఫాం మెడోస్ విల్లాలోనూ ఈ సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 మంది బృందాలు ఏక కాలంలో ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కాగా, మల్లారెడ్డికి చెందిన కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టరుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.