మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (15:34 IST)

వ్యక్తిని చంపి మృతుడి తలతో స్టేషన్‌లో లొంగిపోయిన బావమరుదులు.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. 26 యేళ్ల వ్యక్తిని ఇద్దరు బావమరుదులు అతి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి, దాన్ని పట్టుకుని స్టేషన్‌కెళ్లి లొంగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండల పరిధిలోని నేరళ్లపల్లికి చెందిన సద్దాం హుస్సేన్ (25) అనే వ్యక్తి హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనుముల మండలం మారేపల్లికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఈమెకు సద్దాం హుస్సేన్‌ పరిచమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ సహజీవనం కొనసాగిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ గత 2017లో ఆత్మహత్య చేసుకుంది. అయితే, తమ అక్క చావుకు సద్దాంహుస్సేన్ కారణమని భావించిన ఆమెకు వరుసకు సోదరులైన ఇర్ఫాన్, గౌసుద్దీన్ అతడిపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి నాంపల్లి రచ్చబండ వద్ద సద్దాం తారసపడగా వేట కొడవలితో నరికి చంపారు. అనంతరం తలను వేరు చేసి చేతిలో పట్టుకొని నాంపల్లి పోలీ‌స్ స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు మర్రిగూడ సీఐ గౌరీనాయుడు తెలిపారు.