ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (11:17 IST)

అయ్యప్ప భక్తుల ఆగ్రహం: బైరి నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఫైర్ అవుతున్నారు. హిందూ దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎక్కడిక్కడ ఆందోళన నిర్వహించి బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వికారాబాద్‌లో అయ్యప్ప భక్తులు ఆందోళన చేస్తుండగా బైరి నరేష్ అనుచరుడు వీడియో తీశారు.  కాగా.. రెండు రోజుల క్రితం బైరి నరేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక అయ్యప్ప స్వామి పుట్టుక గురించి అవమానపరుస్తూ వ్యాఖ్యానించారు.
 
ఈ సందర్భంగా వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మీటింగ్‌లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని కోటిరెడ్డి అన్నారు. అలాంటి వారిని పిలవొద్దని సూచించారు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.