శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By JSK
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:28 IST)

స్వ‌యంగా సీఎం కేసీఆర్ బావ‌... ఓ దుకాణం ముందు ఇలా పడుకున్నారు...

హైదరాబాద్ : ఈయ‌న పేరు పర్వతనేని రాజేశ్వర్‌రావు. క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్లలో ఒక దుకాణం ముందు ఇలా ప‌డుకుని క‌నిపించాడు. న‌గరంలో బంద్ న‌డుస్తుండ‌టంతో ఎటూ వెళ్ళే దారి లేక‌... ఈ పెద్దాయ‌న ఇలా ప‌డుకున్న

హైదరాబాద్ :  ఈయ‌న పేరు పర్వతనేని రాజేశ్వర్‌రావు. క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్లలో ఒక దుకాణం ముందు ఇలా ప‌డుకుని క‌నిపించాడు. న‌గరంలో బంద్ న‌డుస్తుండ‌టంతో ఎటూ వెళ్ళే దారి లేక‌... ఈ పెద్దాయ‌న ఇలా ప‌డుకున్నాడ‌న్న‌మాట‌. ఇందులో ఆశ్చ‌ర్యం ఏముంద‌ని అనుకుంటున్నారా? అవును ఉందండి... ఈ పెద్దాయ‌న ఎవ‌రో కాదు... సాక్షాత్తు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్కు బంధువు. స్వయానా కేసీఆర్ కు బావ... కేసీఆర్ అక్క‌కు భ‌ర్త‌. 
 
ఈయన సిరిసిల్ల గాంధీచౌక్‌లోని ఓ దుకాణం ముందు ఇలా పడుకుని కనిపించడం స్థానికులను ఆశ్చర్యం క‌లిగించింది. కోసరావుపేట మండలం మరిమడ్లకు చెందిన రాజేశ్వర్‌రావుకు కేసీఆర్‌ రెండో అక్క విమలమ్మతో పెళ్లయింది. సిరిసిల్లలో నివాసం ఉన్న రాజేశ్వర్‌రావు ఇటీవలే తన సొంత ఇంటిని అమ్మేసి మకాం హైదరాబాద్‌కు మార్చారు. అయితే పని మీద సిరిసిల్లకు వచ్చిన‌ ఆయనకు జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా ఇక్కడి బంద్‌ తెలియక ఇరుక్కుపోయాడు. 
 
సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గాంధీచౌక్‌ వద్దకు వచ్చారు. బస్సులు రాకపోవడంతో తమ కారు కోసం ఫోన్‌ చేశారు. కారు ధర్మపురిలో ఉండటంతో చేసేదేమీ లేక ఓ దుకాణం ముందు సేదదీరారు. రాజేశ్వర్‌రావు గురించి తెలిసిన స్థానికులు పాతవాసు, చౌటపల్లి వెంకటేష్‌ ఆయనను పలకరించి మరో చోటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా, అందుకు నిరాకరించారు. చివరకు తన కారు రాగానే ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయారు.