శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By tj
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (13:51 IST)

మోడీ సాబ్ ఏంటిది.. ప్రధానిపై కేసీఆర్ ఆగ్రహం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటనుకుంటున్నారా? ప్రధాని తప్పు చేసినా ఎవరైనా నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటి పనే చేశారు సీఎం కేసీఆర్. వస్తు సే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటనుకుంటున్నారా? ప్రధాని తప్పు చేసినా ఎవరైనా నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటి పనే చేశారు సీఎం కేసీఆర్. వస్తు సేవా పన్ను అమలు సమయంలో ప్రధానికి అండగా నిలిచి మంచిదంటూ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అదే విషయంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్నారట. జీఎస్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని ప్రధాని గమనించకుండా ఆమోదం తెలపడంపై కేసీఆర్ కోపంగా ఉన్నారట.
 
ప్రధానంగా నిర్మాణంలో ఉన్న తాగు, సాగునీటి ప్రాజెక్టులపై 12 శాతం జిఎస్టీ విధించడాన్ని మాత్రం కేసీఆర్ ఒప్పుకోవడం లేదట. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో అధికంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండడంతో అన్నింటికి పన్ను కట్టడం ఇబ్బందికరంగా మారుతోందట. మొదట్లో జిఎస్టీలో ఇన్ని ఇబ్బందులు ఉంటాయని అనుకోవడం లేదని దీనిపై ప్రధానికి ఖచ్చితంగా లేఖ రాస్తానంటున్నారట కేసీఆర్. 
 
అయితే ఒకే దేశం, ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ... కేసీఆర్ లేఖ రాసినా పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి పన్నుపై మినహాయింపు ఇచ్చే అవకాశం అస్సలు ఉండదు. కేసీఆర్ లేఖ తర్వాత ప్రధాని ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది.