మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (09:55 IST)

తెలంగాణలో అనేకమంది చావులకు సోనియానే కారణం: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా అనేమంది ప్రాణాలు కోల్పోవడానికి సోనియానే కారణమని కేసీఆర్ ఆరోపించారు. 
 
ఉన్న తెలంగాణను జవహర్ లాల్ నెహ్రూ ఊడగొట్టారని... తెలంగాణను అడిగితే కాల్చి వేయాలని ఇందిరాగాంధీ అన్నారని... తెలంగాణను ఇస్తామంటూ 14 ఏళ్లు ఏడిపించి.. జాప్యం చేసిన కారణంగా.. అనేక మంది చనిపోయారని.. వారి చావులకు సోనియా గాంధీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఇదేనని చెప్పారు.
 
కాంగ్రెస్ కుటిల బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసని... అందుకే ఆ పార్టీని తిరస్కరించారని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శనిలా పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తెలంగాణ బాగు కోసం పని చేయలేదని... అన్ని రకాలుగా తెలంగాణను ముంచిన పార్టీ అని ఆరోపించారు.