గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (18:39 IST)

మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు-సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధుపై కీలక ప్రకటన చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు.లబ్ధిదారులు రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చని తెలిపారు. 
 
లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టుకోవచ్చని, ప్రభుత్వ లైసెన్స్‌ అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
 
వచ్చే బడ్జెట్‌ నిధులతో నియోజకవర్గానికి 2000 మందికి దళిత బంధు అందజేస్తామన్నారు. దళితుల కోసం రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
   
దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందని.. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.
 
దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నట్లు చెప్పారు.