తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్  
                                       
                  
                  				  తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఉన్న 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
				  											
																													
									  
	 
	1,663 ఉద్యోగాల భర్తీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జరగనుంది.
				  
	 
	ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన 1,663 ఉద్యోగాల్లో, ఇంజినీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, భూగర్భ జల శాఖలో 88 ఖాళీలు, డైరెక్టర్ ఆప్ వర్క్స్ అకౌంట్స్‌లో 53ఉన్నాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.