గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (14:05 IST)

కరోనాతో పుట్టిన రోజునే కన్నుమూసిన ప్రభుత్వ ఉద్యోగిని

కామారెడ్డి జిల్లా పద్మాజివాడి గ్రామానికి చెందిన విజయ (26) అనే యువతి, కరోనా సోకి, వ్యాధి ముదిరి కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది. ఆమె ప్రస్తుతం తాడ్వాయి తహసీల్దారు కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తోంది. శుక్రవారం ఆమె జన్మదినం కావడం గమనార్హం. అదే రోజున ఆమె మరణించడంతో కార్యాలయంలోని ఉద్యోగులు బోరున విలపించారు. 
 
గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా సెలక్ట్ అయి, ఆపై కొద్దికాలంలోనే తన పనితీరు, విద్యార్హతలతో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె పోస్టింగ్‌ను పొందారు. అనతికాలంలోనే రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆమెను ఎంతో మంది ఉన్నతాధికారులు ప్రశంసించారు కూడా. ఆమె మరణించడం తమ కార్యాలయానికి ఎంతో లోటని, ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని అధికారులు వ్యాఖ్యానించారు.