సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:16 IST)

తెలంగాణ గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

కరోనా ప్రభావంతో రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇందుకు ప్రధాన కారణం.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాయే. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు తదుపరి సమావేశాల తేదీలు నిర్ణయిస్తాయని తెలిసింది.

మూడు వేల కోళ్లు పంపిణీ 
కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రైతులు విలవిలలాడుతున్నారు. రెండు నెలలు కోళ్లను పెంచిన ఓ రైతు, అవి అమ్ముడు పోకపోవడంతో ఆదివారం ఉచితంగా పంపిణీ చేశాడు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌కు చెందిన రవీందర్‌ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లగా రూ.10కి ఒక కోడి కొనుగోలు చేస్తామని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో రవీందర్‌ గ్రామస్థులందరినీ పిలిచి తన పౌల్ర్టీ ఫాంలోని మూడు వేల కోళ్లను ఉచితంగా అందజేశాడు.