శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (17:22 IST)

లిఫ్టులో చిక్కుకున్న హోం మంత్రి నాయిని, డిప్యూటీ సీఎం అలీ

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీలు లిఫ్టులో ఇరుక్కుపోయారు. హైదరాబాదులోని 'అమ్మ' ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సోమవారం వారిద్దరూ వెళ్లారు. అక్కడ  వారు లిఫ్టు ఎక్కారు. 
 
ఆ సమయంలో సాంకేతిక సమస్య కారణంగా అకస్మాత్తుగా లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నాయిని, అలీలు సుమారు మూడు నిమిషాల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. వెంటనే ఆసుపత్రి వారు, భద్రతా సిబ్బంది లిఫ్టు సమస్యను గుర్తించడంతో వాళ్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.