శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (18:35 IST)

వాసాలమర్రిపై సీఎం కేసీఆర్ వరాల జల్లు.. మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుదాం..

కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిపై వరాల జల్లు కురిపించారు. వాసాలమర్రిని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుదామని అన్నారు. గ్రామంలో జబ్బు పడిన వారికి హైదరాబాదులో మంచి వైద్యం చేయిస్తామని వెల్లడించారు. సర్పంచ్, కలెక్టర్‌ ఆ బాధ్యతను నిర్వహించాలని సూచించారు. 
 
విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు ఊరి మంచి కోసం నడుం బిగించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సందర్భంగా... యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 25లక్షల రూపాయల చొప్పున మంజూరు చేశారు.
 
గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ పట్టుపట్టి బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దుదామని అన్నారు. గ్రామంలో ప్రజలంతా సోదరభావం మెలగాలని చెప్పారు. 
 
అంకాపూర్‌ తరహాలో వాసాలమర్రి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఊరంతా ఒక్కతాటిపై రావాలని సూచించారు.