మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 మే 2021 (15:30 IST)

తెలంగాణ లాక్ డౌన్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. కరోనా కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్ విధించడంతో అంతా సొంతూళ్లకు పయనమయ్యారు. బస్సులు కూడా లేకపోవడంతో ప్రయాణికులంతా రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. రైల్వే కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డలతో, లగేజ్‌తో రోడ్డుపైనే ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.