బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (08:13 IST)

తెలంగాణాలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ.45 వేలు

college fee
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఒక జీవోను జారీచేసింది. ఈ జీవో ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ.45 వేలకు పెంచుతున్నట్టు పేర్కొంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60 లక్షలు, సీవీఆర్‌ రూ.1.50 లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్‌, వాసవీ కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.