మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (11:46 IST)

'108' పేజీలతో వివాహ ఆహ్వాన పత్రిక.. ఆ పేజీల్లో ఎలాంటి సమాచారం ఉందో తెలుసా?

తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న కల్వా శివ ప్రసాద్, భాగ్యలక్ష్మి దంపతులు తమ ఇంట జరిగే వివాహ శుభకార్యం కోసం ముద్రించిన వివాహ పత్రిక ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకు

తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న కల్వా శివ ప్రసాద్, భాగ్యలక్ష్మి దంపతులు తమ ఇంట జరిగే వివాహ శుభకార్యం కోసం ముద్రించిన వివాహ పత్రిక ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. మొత్తం 108 పేజీలతో దీన్ని ముద్రించారు. ఇందులో అన్ని రకాల సమాచారాన్ని నిక్షిప్తంచేసి ముద్రించడం గమనార్హం. వరంగల్ జిల్లాలోనేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాహ ఆహ్వాన పత్రిక వివరాలను పరిశీలిస్తే... 
 
వరంగల్‌ శాంతినగర్‌కు చెందిన కల్వా భాగ్యలక్ష్మి, శివ ప్రసాద్‌ దంపతుల కుమారుడి వివాహం ఈనెల 14న హైదరాబాద్‌‌లో వివాహం జరగనుంది. వివాహం తర్వాత 17న హన్మకొండలో రిసెప్షన్, విందు కార్యక్రమం జరుగనుంది. ఈ వివరాలను చెప్పడానికే 108 పేజీల ఆహ్వాన పత్రిక ఎందుకు అంటారా? ఆగండి... ఇవి మాత్రమే కాదు. రైల్వే సమాచారం, ఆర్టీసీ బస్సుల వివరాలు, బ్యాంకులు, అంబులెన్స్‌, ప్రభుత్వాసుప్రతులు, హోటళ్లు, విద్యుత్తు కార్యాలయాలు, గ్యాస్‌ ఏజెన్సీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంది.
 
వీటితోపాటు వరంగల్‌‌లోని వివాహాది వేడుకలు నిర్వహించుకోదగ్గ మందిరాల వివరాలు, పోలీసు స్టేషన్ల ఫోన్ నంబర్లు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల వివరాలు, ఈ సంవత్సరం ద్వాదశ రాశి ఫలాలు తదితర వివరాలన్నీ ముద్రించారు. అలాగే, వివిధ సమయాల్లో ఆచరించాల్సిన పూజలు, విఘ్నేశ్వర, శ్రీవెంకటేశ్వర, శివ, విష్ణు, శ్రీలక్ష్మీనృసింహ, అయ్యప్ప, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, సాయిబాబా, మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి తదితరాలను కూడా ముద్రించి వినూత్నంగా తయారు చేసుకున్నారు. మొత్తానికి తమ శుభలేఖను పదికాలాల పాటు దాచుకునేలా ముద్రించిన కల్వా వారి ఇన్విటేషన్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటుంది.