శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (13:18 IST)

నేడు తెలంగాణాలో ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్నాయి. మొత్తం 554 పోలీస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రాతపరీక్షను నిర్వహిస్తుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి, పోలీస్ శాఖ సాంకేతిక విభాగం ఏర్పాట్లు చేసింది. 
 
ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంటి గంటకు వరకు హైదరాబాద్, మొదలగు ప్రాంతాలతో కలిసి మొత్తం 503 పరీక్షాలను, దీనికి అదనంగా 35 పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 
 
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి మాత్రమే కేంద్రంలో అడుగుపెట్టాలని, బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుని మొత్తం పరిసరాలు సీసీటీవీ కెమెరాలతో చిత్రీకరించేలా ఏర్పాట్లుచేశారు. ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు స్వయంగా పరీక్షా ఏర్పాట్లు చేస్తున్నారు.