1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (15:01 IST)

తెలంగాణలోని ప్రధాన బస్టాండ్లలో వైఫై: అరగంట ఫ్రీ.. ఆపై గంటకు రూ.10

హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ సహా రాష్ట్ర ప్రధాన బస్టాండ్లలో వైఫై సేవలు అందించాలని బీఎస్ఎన్‌ఎల్ నిర్ణయించింది. వైఫై సేవలను మరింత వేగంగా, నాణ్యతతో అందించేందుకు 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగించుకుంటోంది. తొలి అరగంటలో ఈ సేవలు ఉచితంగా ఇవ్వడానికి, తరువాత గంటకు రూ.10 చొప్పున వినియోగ ఛార్జీలను వసూలు చేయడానికి బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో వైఫై సేవలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో.. రైల్వే స్టేషన్లు, కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వైఫై సేవల్ని ఇకపై రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్లలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో నాలుగైదు రోజుల్లో ఎంజీబీఎస్‌తో పాటు మెదక్ జిల్లా పటాన్ చెరు బస్టాండులో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత జిల్లా కేంద్రాల్లో కూడా వైఫై సౌకర్యం రానుంది.