గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (08:56 IST)

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కారు!

students
తెలంగాణ రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఎంసెట్ శిక్షణ కూడా ప్రభుత్వ స్కూల్స్‌లో ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో ఇంటర్ విద్యార్థులు ఎంసెట్ శిక్షణ నిమిత్తం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే బాధ తప్పనుంది. 
 
ఇంటర్ సిలబస్‌ను డిసెంబరు నెలలోనే పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాలేజీల్లోనే ప్రభుత్వమే ఉచితంగా ఎంసెట్ శిక్షణ చర్యలు తీసుకోనుంది. అయితే, ఈ ఎంసెట్ శిక్షణ కేవలం మెరిట్ విద్యార్థులకు మాత్రమే ఇస్తారు. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూపు వారీగా ప్రతి జిల్లాలో 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలు ఎంపిక చేస్తారు.
 
మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో వీరికి ఉచిత శిక్షణ ఇస్తారు.