గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (10:02 IST)

సీఎం కేసీఆర్ సాహసం... వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రత్యేక ముద్రను వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రత్యేక ముద్రను వేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వీలుగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై ఆయన జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీతో ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నుంచి వ్యవసాయదారులందరికీ 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి పంపిణీ, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
 
దీనిపై జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీలు స్పందిస్తూ, సోమవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మోటర్లకు ఐదారు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కరెంటు ఇస్తామని సీఎంకు వివరించారు. అయితే, 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో వచ్చే ప్రభావాన్ని అన్ని విధాలా అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మతించారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులకే వ్యవసాయానికి 9 గంటల కరెంట్  సరఫరా చేస్తున్నామని విద్యుత్తు అధికారులు తెలిపారు. 12 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేశామన్నారు. గత జూన్ 17 నుంచి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
రాష్ట్రం మొత్తంలో 23 లక్షలకుపైగా మోటర్ కనెక్షన్లుంటే… ఈ మూడు జిల్లాల పరిధిలో 9 లక్షల 58 వేల వ్యవసాయ మోటార్లున్నాయి. ఇవి రాష్ట్రంలోని మోటర్లలో 43 శాతం. ప్రస్తుతం 40 శాతం మోటార్లకు 24 గంటల కరెంటును విజయవంతంగా ఇస్తున్నామని తెలిపారు. గరిష్టంగా 9 వేల 500 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే…. చాలినంత విద్యుత్ అందిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.