బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (09:49 IST)

కూలి డబ్బుల గొడవ... భర్త మర్మాంగం కోసిన భార్య

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపలకు 25 యేళ్ళ కిందట వివాహమైంది. కూలి డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన రవీందర్ భోజనం చేసి నిద్రపోయాడు. 
 
ఈ సమయంలో స్వరూప కూరగాయల కత్తితో రవీందర్ మర్మాంగం కోసింది. అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.