భానుడు భగ్గుమంటాడు.. తెలంగాణలో ఎండలే ఎండలు
తెలంగాణలో మూడు రోజుల పాటు భానుడు భగ్గుమంటాడు. ఎండలు మండిపోనున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు వున్నాయని పేర్కొంది.
అంతేగాకుండా జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.