తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పతనం
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి మళ్లీ విజృంభిస్తోంది. చలితోపాటు రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో చలి మళ్లీ విజృంభిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి క్రమంగా పెరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 10.7, హన్మకొండలో 14.5, హైదరాబాద్‌లో 17.7, నిజామాబాద్, రామగుండంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈశాన్య భారతం నుంచి తెలంగాణవైపు తేమగాలులు వీస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ తేలికపాలిట వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం 6 ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు పడ్డాయన్నారు.