శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (14:56 IST)

టీడీపీ బంద్.. రేవంత్ - ఎర్రబెల్లి - రాథోడ్ - రమణ అరెస్టు

నల్గొండ జిల్లాలోని టీటీడీపీ కార్యాలయం ధ్వంసం చేయడాన్ని నిరశిస్తూ.. తెలంగాణ టీడీపీ బుధవారం నల్గొండ జిల్లా బంద్‌ను పాటించింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నల్గొండకు బయలుదేరిన తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, రమేష్ రాథోడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయంపై తెరాస నేతలు దాడి చేయడాన్ని వారు ఖండించారు. వారు బంద్‌లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్, రమేష్ రాథోడ్‌లను బూదాన్ పోచంపల్లి కొత్తగూడెం వద్ద అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. నిరసన చెప్పేందుకు వెళ్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాగా, చిట్యాల పోలీసు స్టేషన్ వద్ద తెరాస, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి.