గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 29 జూన్ 2017 (08:10 IST)

మొదట మూడు వస్తువులు పంపారు.. తర్వాత మూడు నామాలు పెట్టారు. దేవుడి పేరుతో ఠోకరా

చెయిన్ వ్యాపారం అంటే గొలుసుకట్టు వ్యాపారం అని తెలుసు కదా. మొదట ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చెప్పండి దేశమంతా పాకండి అన్న విధంగా మోసాలను కూడా గొలుసుకట్టు పద్దతిలో చేస్తున్న నయా దొంగలను చూసి జనం ఔరా అంటున్నారు. భక్తి పేరుతో, అన్నదానం

చెయిన్ వ్యాపారం అంటే గొలుసుకట్టు వ్యాపారం అని తెలుసు కదా. మొదట ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చెప్పండి దేశమంతా పాకండి అన్న విధంగా మోసాలను కూడా గొలుసుకట్టు పద్దతిలో చేస్తున్న నయా దొంగలను చూసి జనం ఔరా అంటున్నారు. భక్తి పేరుతో, అన్నదానం పేరుతో మొదలైన మోసం చివరికి లక్కీ డ్రా వద్ద ఆగింది. దీంతో ఒక పెల్లెటూరు రైతుకు రెండు దఫాల్లోనూ 65 వేల రూపాయలు గాలికి ఎగిరిపోయి తల పట్టుకోవలసి వచ్చింది. 
 
నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన బూరుగు లక్ష్మయ్యకు ఈ నెల రెండో వారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ కాల్‌ చేసిన వ్యక్తి తాను శ్రీకాళహస్తి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తానని.. మీరు రూ.5200 చెల్లిస్తే మీ పేరున ఆలయంలో అన్నదానం చేస్తామని, మీకు మంచి జరిగేలా మూడు వస్తువులను పంపిస్తామని తెలిపాడు. దీంతో లక్ష్మయ్య ఈ నెల 17వ తేదిన చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్‌ ద్వారా రూ.5200లను ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌కు ఆన్‌లైన్‌లో పంపిచారు.
 
అనంతరం పార్సిల్‌లో లక్ష్మయ్యకు మూడు వస్తువులు వచ్చాయి. వాటితో పాటు మరో పేపర్‌లో మీకు రూ.5.70 లక్షల లక్కీ డ్రా తగిలిందని పేర్కొన్నారు. ఇందుకుగాను మీరు రూ.60 వేలు చెల్లిస్తే డ్రాలో వచ్చిన డబ్బులు మీ బ్యాంక్‌ అకౌంట్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో ఈనెల 19వ తేదిన లక్ష్మయ్య చిట్యాలలోని ఆంధ్రా బ్యాంక్‌ ద్వారా రూ.50 వేలు, ఎస్‌ బీహెచ్‌ ద్వారా రూ.10 వేలను పంపారు. 
 
అయినప్పటికీ లక్కీ డ్రాలో వస్తాయనుకున్న డబ్బులో అకౌంట్‌లో జమకాలేదు. దీంతో లక్ష్మయ్య తన కు కాల్‌ వచ్చిన సెల్‌ నంబర్‌లకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వస్తుండడంతో మోసపోయానని గుర్తిం చి చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవుడి పేరు చెప్పి ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన చేసిన ఘటనపై బుధవారం చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చోటుచేసినట్టు ఎస్‌ఐ బాల్‌గోపాల్‌ తెలిపారు.