మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (12:50 IST)

ఆ మూడు ఘటనలపై నివేదిక ఎక్కడ.. గవర్నర్ ప్రశ్న

tamilisai
తెలంగాణ గవర్నర్ తమిళిసై- సీఎం కేసీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్‌. 
 
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి. రామయంపేటతోపాటు ఖమ్మం ఘటనలు రెండు కూడా లా అండ్ ఆర్డర్‌కు సంబంధించినవి. ఈ రెండింటిపై రాష్ట్ర సర్కార్ విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. వీటిపై రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది.  
 
తాజాగా గవర్నర్ తమిళిసై వివిధ సంఘటనలపై నివేదిక కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ప్రస్తుతం హట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ గవర్నర్‌కు నివేదిక పంపే అవకాశాలు లేవన్నది కొందరి వాదన. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాకపోతే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది.