ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 27 జూన్ 2020 (18:23 IST)

కరోనా బాధితుడికి ఆరు రోజులకు అయిన ఫీజు అక్షరాలా రూ. 3,40,000, ఎక్కడ?

కరోనాకు గత కొన్నిరోజుల ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స చేసేవారు. కానీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రులలోను చికిత్స చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. అధునాతన వసతులు ఉన్న ఆసుపత్రులలో చికిత్స చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. 
 
ముఖ్యంగా తెలంగాణా లాంటి ప్రాంతాల్లో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వచ్చినవారు ప్రైవేటు ఆసుపత్రులలోనే ఎక్కువగా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సోమాజిగూడ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సరిగ్గా ఎనిమిదిరోజుల క్రితం ఒక పేషెంట్ కరోనాతో చేరాడు.
 
అతనికి చికిత్స చేసిన వైద్యులు నిన్న డిశ్చార్జ్ చేశారు. ఏకంగా అతనికి 3 లక్షల 40 వేల రూపాయల బిల్లును ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండటంతో ఆ వ్యక్తి బిల్లును చెల్లించాడు. కానీ చెల్లించిన బిల్లును అతని స్నేహితుడికి పంపించడం.. అది కాస్త ఫార్వర్డ్ అవుతూ విషయం కాస్త బయటకు వచ్చింది.
 
ఈ స్థాయిలో బిల్లులు చెల్లించి ప్రాణాల మీదకు తెచ్చుకునేదాని కన్నా స్టే హోం.. స్టే సేఫ్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళితే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త.