శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 2 జులై 2020 (14:48 IST)

ఇద్దరు అక్కలను చంపిన తమ్ముడు ఆత్మహత్య

చాంద్రాయణగుట్ట డబుల్ మర్డర్ కేసులో నిందితుడైన ఇస్మాయిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇస్మాయిల్ రెండు రోజుల క్రితం తన ఇంట్లో ముగ్గురు అక్కలపై కత్తితో దాడి చేయగా వారిలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వారితో పాటు అడ్డువచ్చిన బావను కూడా కత్తితో పొడిచి గాయపరిచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.
 
ఈ క్రమంలో పోలీసులు ఇస్మాయిల్‌ను గాలించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికులు నిందితుడి ద్విచక్రవాహనము ఇంటి వెనుక భాగమున ఉందని తెలపారు. దీనితో ఫలక్‌నుమా ఏసీపీ మహమ్మద్ అజీజ్, చాంద్రాయణగుట్ట ఎస్సై రుద్రభాస్కర్ ఇస్మాయిల్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అతని మృతదేహం ఇంటి వెనుకే పడి వుంది. హత్యకు పాల్పడిన నిందితుడు సోమవారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.