శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ESHWAR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (12:29 IST)

ఆధార్ ఉంటేనే...ఆ గ్రామాల్లోకి ప్రవేశం... చీకటి పడితే కొత్తవారికి నో ఎంట్రీ

ఒకప్పడు నగరాలకే పరిమితమైన దొంగతనాలు గ్రామాలకూ పాకిపోయాయి. ఒకప్పుడు గ్రామంలోకి కొత్త వారు వస్తే ఎవరింటికొచ్చారు అని మర్యాదగా పలుకరించి అడ్రస్ చూపించేవారు. కానీ నేడు తెలియని మొహం తమ గ్రామాల్లో కనిపిస్తే అనుమానంగా చూస్తున్నారు. బాబు నీ ఆధార్ కార్డ్ చూపించు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి విరుగుడుగా ఇప్పుడు ఆ గ్రామాల వెంట వెళ్లేవారు గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. బీహార్ దొంగలు వచ్చారు... దోచేశారు.. ఎక్కడ చూసినా ఇదే మాట. ఖమ్మం జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో చూసిన ఈ దొంగల ప్రచారమే. భయం భయంగా జీవిస్తున్నారు. పోలీసులంతా దొంగల కోసం తిరుగుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ దొంగలను పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికి దొంగల ప్రచారం తగ్గడం లేదు. ప్రజలకు ధైర్యం రోజురోజుకు సన్నగిల్లుతోంది. 
 
ఇది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఎక్కువగా జరుగుతోంది. గ్రామాల్లో రాత్రి అయిందంటే చాలు దొంగలు బాబోయ్ బాబోయ్ దొంగలు అన్న పరిస్థితి ఉంది. రాత్రి అయ్యిందంటే చాలు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది. మొన్నటికి మొన్న సత్తుపల్లిలో మూడు ఇళ్లలో చోరీ జరిగింది. ఆ చోరీ కోసం ఇళ్లలో డాగ్స్ తనిఖీ జరుగుతుంది. ఆ సమయంలోనే పట్టణంలో మరో చోరీ జరిగింది. ఒక్క వైపు పోలీసుల తనిఖీలు జరుగుతుండగానే మరో వైపు చోరీలు జరగడం గమనార్హం. 
 
ఇంకోవైపు జిల్లాలోని ఉన్న అన్ని పట్టణాలకు సరిహద్దుల్లో మరో జిల్లా ఉంది. దీంతో చోరీలు చేసిన దొంగలు ఈజీగా పరారీ అవుతుండగా... దొంగల కోసం పోలీసులు హైరానా పడాల్సి వస్తుంది. ఇక కట్ చేస్తే... చోరీలు జరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన ప్రారంభమైంది. పోలీసులేమో తమకు సిబ్బంది తక్కువగా ఉందంటున్నారు. దీంతో గ్రామాల్లో యువకులు ఒక బృందంగా మారిపోయి కాపలా తిరుగుతున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు మరిన్ని ఇక్కట్లు కొని తెచ్చి పెడుతున్నాయి. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వారు వస్తే చాలు వారిని దొంగను చూసినట్లుగా చూస్తున్నారు. 
 
కొన్ని సందర్భాల్లో అయితే దాడులు కూడా జరుగుతున్నాయి. మధిర సమీపంలో మోటార్ సైకిల్‌కు అడ్డంగా కొంత మంది వచ్చారు. వారిని దొంగలు అనుకుని మోటార్ సైకిల్ వదిలిపెట్టి పరారీ అయ్యాడు. ఇలా దొంగల ప్రచారం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో తిరుగుతున్న కాపలాదారులు అత్యుత్సాహాన్ని కూడా చూపిస్తున్నారు. ప్రధానంగా కొత్త వారు వస్తే వారి గుర్తింపు కార్డు కూడా అడుగుతున్నాట. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోకి వచ్చే వారు తమ వెంట రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డును తీసుకుని వచ్చే రోజులు వచ్చాయి. దొంగల భయం ఈ జిల్లాలో అంతగా వేధిస్తోంది.. మరీ.