గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (14:22 IST)

నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగల ముఠా - పెట్రోల్ బంకు సిబ్బందిపై దాడి

నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. 10 మంది ముఠా సభ్యులు పెట్రోల్ బంకుపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.40 వేల నగదును దోచుకెళ్లింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి హూటాహుటిన చేరుకుని ఆ పరిసరాలను పరిశీలించారు. అలాగే, కేసు నమోదు చేసిన  పోలీసులు.. పెట్రోల్ బంకులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.