గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: మంగళవారం, 22 మే 2018 (11:47 IST)

అమ్మాయి ఉద్యోగం కోసం అప్లై చేస్తే రూ. 5.40 లక్షలు దోచేశారు...

అమ్మాయిని మోసం చేసి రూ. 5.40 లక్షలు దోచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని నిలువునా మోసం చేసిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు న్యూఢిల్లీకి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కుమార్ గౌరవ్, అంకిత్ కుమార్,

అమ్మాయిని  మోసం చేసి రూ. 5.40 లక్షలు దోచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని నిలువునా మోసం చేసిన కేసులో రాచకొండ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు న్యూఢిల్లీకి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కుమార్ గౌరవ్, అంకిత్ కుమార్, అమిత్ కుమార్ పాయ్ అనే ముగ్గురు యువకులు కాల్ సెంటర్ మాదిరిగా ఓ సెంటర్‌ను పెట్టుకుని, తాము ఎంఎన్సీల్లో మానవ వనరుల విభాగం అధికారులమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
 
మౌలాలీకి చెందిన ఓ అమ్మాయి, ఉద్యోగం కోసం 'షైన్ డాట్ కామ్' అనే వెబ్ సైట్‌లో దరఖాస్తును అప్‌లోడ్ చేసింది. ఆపై ఓ వ్యక్తి ఫోన్ చేసి, తానో మల్టీ నేషనల్ కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌నని పరిచయం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1,850 చెల్లించాలని చెప్పి, పేటీఎం ఖాతాలో వేయించుకున్నాడు. 
 
ఆ తరువాత పలు కారణాలు చెబుతూ బ్యాంకు ఖాతాల్లో, వాలెట్లలో డబ్బులు వేయించుకున్నాడు. ఆపై ఓమారు సదరు యువతికి ఫోన్ చేసి ఓటీపీ చెప్పించుకున్నారు. ఆపై ఆమె బ్యాంకు ఖాతా నుంచి 100కు పైగా లావాదేవీలు చేసుకుని రూ. 5.40 లక్షలను దోచుకున్నారు. దీనిపై సదరు యువతి ఫిర్యాదు చేయగా, విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.