1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 3 ఆగస్టు 2019 (12:54 IST)

టిక్ టాక్ అభిమానులకు చేదువార్త.. నిషేధించాలని కోరిన రాష్ట్రాలు...

దేశవ్యాప్తంగా టిక్ టాక్ పిచ్చి చాలామంది యువతీయువకుల్లో పీక్స్‌కు చేరింది. ఖాళీ దొరికితే చాలు టిక్ టాక్ చేసేయడం అలవాటుగా మార్చేసుకున్నారు యువత. ఖాళీగా ఉన్న యువత విషయాన్ని అలా ఉంచితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏకంగా టిక్ టాక్ చేస్తూ ఉద్యోగాలు పోగొట్టేసుకుంటున్నారు.
 
ప్రభుత్వ విధులు నిర్వర్తించే సమయంలో ఆ పనిని పక్కనబెట్టి టిక్ టాక్ పైన దృష్టి పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో అయితే చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న సంధర్భాలు ఉన్నాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి ఒక వినతిని పంపింది. తెలంగాణాలో టిక్ టాక్ ను నిషేధించడానికి అనుమతి కావాలని.
 
తెలంగాణా రాష్ట్రం ఒక్కటే కాదు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు ఆయా రాష్ట్రాలు ప్రభుత్వాలు. ఈ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకుంది. త్వరలోనే ఈ రాష్ట్రాల్లో టిక్ టాక్‌ను నిషేధించనున్నట్లు తెలుస్తోంది.