బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (11:23 IST)

హన్మకొండ ఉత్సవాలకు వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వారిద్దరూ పోటాపోటీగా పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. 
 
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెం పర్యటనకు వెళ్లారు. అక్కడ చెంచులతో సమావేశమైన ఆమె పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. ఇపుడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. హన్మకొండలో జాతీయ సాంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సాంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వాహుకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.