శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (11:17 IST)

బీజేపీ తరపున పోటీ చేస్తానంటున్న నటి రేష్మా రాథోడ్

భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ నటి రేష్మా రాథోడ్ వ్యాఖ్యానిస్తోంది. ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్‌ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటిని అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు. 
 
పార్టీ ఆదేశిస్తే వైరా నియోజకవర్గంనుంచి తాను పోటీచేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెరాస ప్రభుత్వం సహకరించకుండా దానిని మెదక్‌కు తరలించాలని చూసిందని ఆరోపించారు. 
 
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.