మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (16:15 IST)

పనికిమాలిన బడ్జెట్ - దేశానికి మేలు జరగదు : రేవంత్ రెడ్డి

లోక్‌సభలో మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది ఒక పనికిమాలిన బడ్జెట్ అని, దేశానికి ఎలాంటి మేలు జరగదన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ ఇలా ఏ ఒక్కరికి మేలు చేసేలా లేదన్నారు.
 
కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారని, అందుకే కక్ష గట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల రాయితీలో కోత విధించారని ఆరోపించారు. 
 
పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించామని, రైతులు పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా, జీఎస్టీ పన్నుల విధానంలో మార్పులు చేయాలేదన్నారు. వైద్య మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం కుదుపటపడే పరిస్థితి వచ్చిందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఆరోగ్యం ఎవరికి ఉపయోగపడే నిర్ణయాలను ఈ బడ్జెట్‌లో వెల్లడించలేదని ఆయన చెప్పుకొచ్చారు.